Share News

గూడూరులో 41.2 డిగ్రీలు

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:04 AM

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. పడమర దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది.

గూడూరులో 41.2 డిగ్రీలు

  • నేడు 17 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు.. అక్కడక్కడా వర్షాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. పడమర దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది. శనివారం గూడూరులో 41.2, రేణిగుంటలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వాతావరణ అనిశ్చితితో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కాగా ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 17 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ఆదివారం అక్కడక్కడా పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Updated Date - Apr 05 , 2026 | 05:05 AM