Share News

ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - May 05 , 2026 | 05:47 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభ త్సం సృష్టించాయి. గాలులకు స్థానిక వారపుసంతలోని...

ఈదురుగాలుల బీభత్సం

  • పాకపై కూలిన భారీ వృక్షం.. ముగ్గురు మహిళల మృతి

  • మరో నలుగురికి తీవ్రగాయాలు

పెదబయలు, మే 4(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభ త్సం సృష్టించాయి. గాలులకు స్థానిక వారపుసంతలోని ఒక పాకపై భారీ వృక్షం కూలడంతో ముగ్గురు చిరు వర్తకులైన ఒడిశా మహిళలు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. భారీవర్షం కురుస్తుండడంతో ఒక పాకలో కొర్రా తిత్తమ్మ(30), కోడా ఇచ్చమ్మ(40), పి.మోనిమా(40)తోపాటు మరో నలుగురు తలదాచుకున్నారు. ఈదురుగాలులకు ఆ పాకపై చెట్టు పడడంతో తిత్తమ్మ, ఇచ్చమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. పి.మోనిమా, కె.పరిమిలకు తీవ్ర గాయాలు కావడంతో పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించార ు. అక్కడ చికిత్స పొందుతూ పి.మోనిమా మృతి చెందారు. కె.పరిమిలను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. మిగతా నలుగురికి స్థానిక పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు.

Updated Date - May 05 , 2026 | 05:47 AM