ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:54 AM
కాకినాడ జిల్లాలో బుధవారం పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు అన్నవరం రత్నగిరిపై అన్నదానం, పశ్చిమ రాజగోపురం తదితర ప్రాంతాలతో..
అన్నవరం కొండపై విరిగిపడిన చెట్లు
అన్నవరం, విజయనగరం, జూన్ 10(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో బుధవారం పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు అన్నవరం రత్నగిరిపై అన్నదానం, పశ్చిమ రాజగోపురం తదితర ప్రాంతాలతో పాటుగా ఘాట్‌రోడ్డు వెంబడి చెట్లన్నీ విరిగా పడ్డా యి. ప్రత్తిపాడు మండలం చింతలూరులో బుధవారం సాయంత్రం పిడుగులు పడి కొబ్బరి చెట్లు దగ్ధమమవడం తో స్థానికులు తీవ్ర భయాందోళన గురయ్యారు. అలాగే కోటనందూరు మండలం పాతకొట్టాంలో పిడుగుపాటుకు యడ్ల జాన్ ప్రసాద్(40) అనే వ్యక్తి మృతిచెందాడు. కొత్తకొట్టాంలో పిడుగుపాటుకు ఓ గేదె మృత్యువాత పడింది. ఇక, విజయనగరం జిల్లాలో ఈదురుగాలులకు చెట్లు, ఫ్లెక్సీలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గజపతినగరంలో కారుపై విద్యుత్ స్తంభం కూలింది. నెల్లిమర్ల, రామభద్రంపురం, ఎస్.కోట, గంట్యాడ తదిత మండలాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాట్లిల్లింది.