Share News

పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి

ABN , Publish Date - May 06 , 2026 | 04:47 AM

విజయనగరం జిల్లాలో మంగళవారం పిడుగులు పడి నలుగురు మృతిచెందారు. రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెంది న మజ్జి సత్తెమ్మ (55), ఆమె తోటికోడలు...

పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి

రాజాం రూరల్‌, మే 5(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో మంగళవారం పిడుగులు పడి నలుగురు మృతిచెందారు. రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెంది న మజ్జి సత్తెమ్మ (55), ఆమె తోటికోడలు మజ్జి అప్పలనరసమ్మ (50), పైల రాము (45) అనే మహిళ ఉదయం పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం చిరుజల్లులు పడుతుండటంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. ఇదే సమయంలో పిడుగు పడడడంతో ముగ్గురూ చనిపోయారు. కాగా, తెర్లాం సమీపంలోని చెరువువద్ద మంగళవారం సాయంత్రం పిడుగుపడి జమ్ముల సూర్యనారాయణ (60) మృతిచెందారు. సాయంత్రం పని ముగిశాక ఇంటికి వస్తున్న సమయంలో పిడుగుపడడంతో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఘటనలో గణపతి అనే వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - May 06 , 2026 | 04:48 AM