ఉపాధి పనులు 11లోపు ముగించాలి
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:34 AM
వేసవి అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి సూచించారు.
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): వేసవి అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి సూచించారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకూడదన్నారు. ఉపాధి కూలీల పనులను ఉదయం 11 గంటల్లోపు ముగించాలని, పని చేసే చోట తాగునీరు, మజ్జిగ, ప్రథమ చికిత్స, టెంట్లు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల సమాచారానికి స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని సూచించారు.
వాతావరణ అనిశ్చితితో వర్షాలు
ఉపరితల ద్రోణి, ఆవర్తనం కొనప్రభావంతో బుధ వారం పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలుకు రిశాయి. కో స్తా, రాయలసీమల్లోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. కర ్నూలులో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అ నిశ్చితి పరిస్థితుల వల్ల నెలాఖరు వరకు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.