Share News

బొట్లగూడూరులో 42.6 డిగ్రీలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:00 AM

రాష్ట్రంలో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది.

బొట్లగూడూరులో 42.6 డిగ్రీలు

అమరావతి, విశాఖపట్నం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది. మూడు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, నాలుగు మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మార్కాపురం జిల్లా బొట్ల గూడూరులో 42.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం రాయలసీమ, మధ్య కోస్తాలోని 35 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 87 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Updated Date - Mar 29 , 2026 | 04:02 AM