Share News

కోస్తాలో చెదురుమదురు వర్షాలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:12 AM

దక్షిణ కర్ణాటక నుంచి మరట్వాడా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అధిక పీడనం ప్రభావంతో భూఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి.

కోస్తాలో చెదురుమదురు వర్షాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కర్ణాటక నుంచి మరట్వాడా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అధిక పీడనం ప్రభావంతో భూఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీంతో గురువారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఒకటి, రెండుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Feb 27 , 2026 | 03:13 AM