Share News

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:30 AM

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో బుధవారం పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. అక్కడక్కడా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో...

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!

  • 4 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు

  • నేడూ పలు ప్రాంతాలకు వర్ష సూచన

విశాఖపట్నం, అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో బుధవారం పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. అక్కడక్కడా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, సీమల్లో పలుచోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో గల ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 3న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావర ణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 4వ తేదీ నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు, ఈనెల 5 నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడనం రాజస్థాన్‌ వైపు పయనించనున్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రుతుపవనాలు దేశంలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంతోపాటు తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో వర్షాలు పెరుగుతాయన్నారు.

ఉత్తరరాంధ్రలో... ఉత్తరాంధ్ర ప్రాంతంలో గురువారం మేఘావృత వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది.

Updated Date - Jul 02 , 2026 | 03:30 AM