Share News

22 లేదా 23న అల్పపీడనం

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:52 AM

మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు, మధ్యభారతం వైపు పయనించే క్రమంలో గురువారం నాటికి పూర్తిగా బలహీనపడనున్నది.

22 లేదా 23న అల్పపీడనం

విశాఖపట్నం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు, మధ్యభారతం వైపు పయనించే క్రమంలో గురువారం నాటికి పూర్తిగా బలహీనపడనున్నది. ఈ నేపథ్యంలో వాయవ్య బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి ఉపరితల ఆవర్తనం ఆవరించి, దాని ప్రభావంతో 22 లేదా 23వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం వల్ల కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అవకాశం తక్కువని అంచనా వేశారు. కాగా, బుధవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది.

Updated Date - Aug 20 , 2026 | 03:53 AM