బెంగాల్ పరిసరాల్లో వాయుగుండం
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:30 AM
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా, గురువారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.
విశాఖపట్నం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా, గురువారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఆతర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ తీరం దాటిన వాయుగుండం గురువారం మధ్యాహ్నానికి కోల్‌కతాకు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో గురువారం మేఘాలు ఆవరించాయి తప్ప వర్షం కురవలేదు. శుక్ర, శనివారాల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.