Share News

కొనసాగిన ఎండ.. తిరుపతిలో 39.4 డిగ్రీలు

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:30 AM

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది.

కొనసాగిన ఎండ.. తిరుపతిలో 39.4 డిగ్రీలు

అమరావతి, విశాఖపట్నం, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుపతిలో గురువారం 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు అక్కడక్కడా వాతావరణ అనిశ్చితి నెలకొని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jul 24 , 2026 | 05:31 AM