రేపటి నుంచి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల
ABN , Publish Date - May 30 , 2026 | 05:52 AM
రాష్ట్రంలో ఈ నెల 31 నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది
అమరావతి, శ్రీకాకుళం, మే29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ నెల 31 నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శుక్రవారం అత్యధికంగా నెల్లూరు జిల్లా కొమ్మిపాడు లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 64 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనంతో అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరుగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పిడుగులతో పడతాయని వివరించింది.