Share News

తగ్గిన ఎండ తీవ్రత.. పలుచోట్ల వర్షాలు

ABN , Publish Date - May 07 , 2026 | 03:59 AM

రాష్ట్రంలో బుధవారం ఎండ తీవ్రత కాస్త తగ్గింది. కర్ణాటక నుం చి రాయలసీమ, తమిళనాడు మీ దుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు...

తగ్గిన ఎండ  తీవ్రత.. పలుచోట్ల వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం ఎండ తీవ్రత కాస్త తగ్గింది. కర్ణాటక నుం చి రాయలసీమ, తమిళనాడు మీ దుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉత్తర, దక్షిణ ద్రోణి విస్తరించింది. అలా గే ఉత్తర తెలంగాణ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇదే సమయంలో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కర్నూ లు జిల్లా తోవిలో 41.6, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని ఏడు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎండ, ఉక్కపోత, అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Updated Date - May 07 , 2026 | 03:59 AM