Share News

నెల్లూరులో 38.5 డిగ్రీలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 03:52 AM

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎక్కువ ప్రాంతాల్లో గురువారం పొడి వాతావరణం కొనసాగింది.

నెల్లూరులో 38.5 డిగ్రీలు

విశాఖపట్నం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎక్కువ ప్రాంతాల్లో గురువారం పొడి వాతావరణం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరులో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం తరువాత వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండ ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Aug 21 , 2026 | 03:53 AM