Share News

13న అల్పపీడనం

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:02 AM

పశ్చిమబెంగాల్‌, ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కొనసాగుతోంది.

13న అల్పపీడనం

విశాఖపట్నం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పశ్చిమబెంగాల్‌, ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది వాయవ్యంగా పయనించి క్రమేపీ బలహీనపడనున్నది. అల్పపీడనం రాష్ట్రానికి దూరంగా ఉండడంతో ఏపీపై ప్రభావం లేదు. కాగా, 13న పశ్చిమబెంగాల్‌ను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండ తీవ్రత నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. బాపట్లలో అత్యధికంగా 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగుతుందని, పలుచోట్ల పిడుగులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Aug 10 , 2026 | 04:03 AM