Share News

ఎండ తీవ్రత తగ్గింది

ABN , Publish Date - May 08 , 2026 | 04:58 AM

ఏపీ దిగువ ట్రోపో ఆవరణలో వీస్తున్న ఆగ్నేయ, నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని...

ఎండ తీవ్రత తగ్గింది

  • వీఆర్‌పురంలో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

  • నేడు, రేపు తేలికపాటి వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి): ఏపీ దిగువ ట్రోపో ఆవరణలో వీస్తున్న ఆగ్నేయ, నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం పోలవరం జిల్లా వీఆర్‌పురంలో 41.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు అల్లూరి జిల్లా గంపరైలో 21.5, గుంటూరు జిల్లా మంగళగిరిలో 15.2, తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడిలో 13.2, గుంటూరు రూరల్‌ నల్లపాడులో 12 మిల్లీమీటర్ల వాన పడింది. శుక్రవారం అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. అల్లూరి, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల్లోని 7 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

Updated Date - May 08 , 2026 | 04:59 AM