Share News

నేడు అక్కడక్కడా వర్షాలు

ABN , Publish Date - Jul 25 , 2026 | 04:50 AM

రాష్ట్రంలో పొడి వాతావరణంతో ఓవైపు ఎండలు మండిపోతుండగా... మరోవైపు అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి.

నేడు అక్కడక్కడా వర్షాలు

అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొడి వాతావరణంతో ఓవైపు ఎండలు మండిపోతుండగా... మరోవైపు అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. శనివారం కోస్తా ప్రాంతంలో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, కడప జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Jul 25 , 2026 | 04:51 AM