రాష్ట్రంలో పెరిగిన ఎండ
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:04 AM
బంగాళాఖాతంలో రెండు రోజుల కిందట ఏర్పడిన వాయుగుండం తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని..
తిరుపతి, కావలి, నెల్లూరుల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో రెండు రోజుల కిందట ఏర్పడిన వాయుగుండం తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం రాష్ట్రానికి దూరంగా ఉండడంతో రాష్ట్రంపై దాని ప్రభావం ఏమీ లేదు. దీంతో ఎండ తీవ్రత పెరిగింది. తిరుపతి, కావలి, నెల్లూరుల్లో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.