Share News

కోస్తా, రాయలసీమలకు వర్షసూచన

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:14 AM

రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉందని..., ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తా, రాయలసీమలకు వర్షసూచన

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉందని..., ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17 నుంచి కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 19న రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, శనివారం రాయలసీమలో అనేకచోట్ల ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లా బెస్తవారిపల్లె మండలం పిటికాయగుల్లలో 40.17, అనంతపురంలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 15 , 2026 | 04:15 AM