Share News

నేడు, రేపు విభిన్న వాతావరణం

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:30 AM

తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

నేడు, రేపు విభిన్న వాతావరణం

  • ఓవైపు ఎండ తీవ్రత వడగాడ్పులు.. మరోవైపు పిడుగులతో అకాల వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలుచోట్ల పిడుగులు, వడగళ్లు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆది, సోమవారాల్లో అల్లూరి, మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా శనివారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Apr 19 , 2026 | 04:31 AM