Share News

బాబోయ్‌ ఎండ!

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:06 AM

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 42 డిగ్రీలు దాటేశాయి. సోమవారం కడప జిల్లా ఒంటిమిట్ట, ఖాజీపేటలో 42.5. కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.3, అనంతపురం జిల్లా...

బాబోయ్‌ ఎండ!

  • ఒంటిమిట్టలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత

  • 8 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

అమరావతి, మార్చి30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 42 డిగ్రీలు దాటేశాయి. సోమవారం కడప జిల్లా ఒంటిమిట్ట, ఖాజీపేటలో 42.5. కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.3, అనంతపురం జిల్లా యల్లనూరు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 40.5, మార్కాపురం జిల్లా పిటికాయగుల్ల, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 40.3, తిరుపతి జిల్లా నాగలాపురంలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం విభిన్న వాతావరణ ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. మన్యం, పోలవరం జిల్లాల్లోని 8 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది.

Updated Date - Mar 31 , 2026 | 05:06 AM