Share News

ఎండ తీవ్రత.. వర్ష సూచన

ABN , Publish Date - May 16 , 2026 | 05:16 AM

ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు అల్పపీడనంతో వర్షాలతో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకుంటున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఎండ తీవ్రత.. వర్ష సూచన

  • కొప్పెరపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు అల్పపీడనంతో వర్షాలతో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకుంటున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డవ్వగా, నంద్యాల జిల్లా కొత్తపల్లె, ఎన్టీఆర్‌ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, పల్నాడు జిల్లా గండిగనుమలలో 42.6, అనంతపురం జిల్లా రాయదుర్గం, కర్నూలు జిల్లా నగరడోనలో 42.2, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 42.1, మార్కాపురం జిల్లా అర్ధవీడులో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల మేఘావృత వాతావరనం, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Updated Date - May 16 , 2026 | 05:17 AM