మండిన కోస్తా
ABN , Publish Date - May 24 , 2026 | 04:14 AM
వాయవ్య గాలులతో శనివారం కోస్తా, రాయలసీమ ఉడికిపోయాయి. కోస్తాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువచోట్ల వడగాడ్పులు, పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతకు రోడ్లు నిప్పుల కొలిమిలా మారాయి.
కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీలు
95 మండలాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు
అనకాపల్లి జిల్లాలో ఈదురుగాలులు.. ఇద్దరి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
వాయవ్య గాలులతో శనివారం కోస్తా, రాయలసీమ ఉడికిపోయాయి. కోస్తాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువచోట్ల వడగాడ్పులు, పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతకు రోడ్లు నిప్పుల కొలిమిలా మారాయి. రాత్రి పూట కూడా వేడి వాతావరణం కొనసాగింది. ఆకాశం మేఘావృతమై, పగలూ, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోస్తాలో 13 జిల్లాల్లోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్‌లో 45, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3, విశాఖరూరల్‌లో 42.8, అల్లూరి జిల్లా రామరాజుపాలెం, కాకినాడ జిల్లా కోటనందూరులో 42.6, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 42.5, ప్రకాశం జిల్లా కొండపిలో 42.4, గుంటూరు జిల్లా రాయపూడిలో 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఉపరితల ద్రోణుల ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం కురిసింది. మరోవైపు నై రుతి రుతుపవనాలు శనివారం అరేబియా సము ద్రం, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలు, కొమొరిన్ తీర ప్రాంతంలో పలుచోట్లకు విస్తరించాయి. వాయవ్య, మధ్య, తూర్పు, పశ్చిమ భారతం.. దాని కి ఆనుకుని దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో నెలాఖరు వరకు ఎండలు, వేడి వాతావరణం కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
నలుగురు మృతి..
ఏలూరు జి ల్లా పెదవేగి మండలంలో శనివారం వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. పెదవేగికి చెందిన మారగాని శ్రీనివాసరావు(60) పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వడదెబ్బ కు గురై మరణించారు. అలాగే, కొప్పాకకు చెందిన చల్లారి రాటాలరావు(55) స్థానిక పెద్దచెరువులో మట్టి పనులు చేస్తూ వడదెబ్బకు గురై మృతిచెందారు. కాగా, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీలు మరణించారు. వారిని అరట్లకోట గ్రామానికి చెందిన గెడ్డమూరి శంకరయ్య(55), గర్లంక దొరబాబు(41)గా గుర్తించారు.
నేడు 9 జిల్లాల్లో 45-46 డిగ్రీలు!
రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎక్కువ ప్రాం తాలు, రాయలసీమలో పలు ప్రాంతాల్లో వడగా డ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఏలూ రు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 45-46 డిగ్రీలు, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో 42-44 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చితూ ్తరు జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అలాగే, ద్రోణి ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.