Share News

అనంతపురంలో 37.3 డిగ్రీలు

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:25 AM

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. ప్రధానంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే...

అనంతపురంలో 37.3 డిగ్రీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. ప్రధానంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవయ్యాయి. దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 37.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 36.8, కర్నూలులో 36.5, నంద్యాలలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో ఎక్కువచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Mar 01 , 2026 | 06:26 AM