Share News

అనంతలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:15 AM

రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

అనంతలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 37.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడా జల్లులు కురిశాయి. శనివారం కూడా సీమలో జల్లులు కురిసే అవకాశం ఉందని, కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది.

Updated Date - Feb 28 , 2026 | 05:15 AM