kumaram bheem asifabad- కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:25 PM
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యాదవ్‌రావ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో మార్లవాయిలో కమ్యూనిటీ భవనం, తాగునీరు, గుస్సాడీ భనవం, డార్ఫ్ రీడింగ్ రూం, పద్మశ్రీ గుస్సాడీ రాజుకు ఆసిఫాబాద్‌లో గృహం మంజూర అయిందని చెప్పారు. వాటి కోసం సుమారు 20 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మార్లవాయి అభివృద్ధి జరుగలేదని కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదని చెప్పారు
జైనూర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యాదవ్‌రావ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో మార్లవాయిలో కమ్యూనిటీ భవనం, తాగునీరు, గుస్సాడీ భనవం, డార్ఫ్ రీడింగ్ రూం, పద్మశ్రీ గుస్సాడీ రాజుకు ఆసిఫాబాద్‌లో గృహం మంజూర అయిందని చెప్పారు. వాటి కోసం సుమారు 20 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మార్లవాయి అభివృద్ధి జరుగలేదని కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. మార్లవాయిలో అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పర్యటించడంతో ప్రభుత్వం ఈ గ్రామంలో అనేక రకమైన అభివృద్ధి పనులు మంజురు చేసిందని అన్నారు. మార్లవాయి అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల పత్రాలను ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎందుకు చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆదివాసీ జాతుల మధ్య చిచ్చు పెట్టేందుకే పాలకవర్గం యత్నిస్తోందని విమర్శించారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మార్లవాయి అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ పాలనలో మార్లవాయిలో అభివృద్ధి పనులు కొనసాగాయని చెప్పారు. తాగునీటి సదుపాయం, మిని ట్యాంక్ బండ్, ఆశ్రమోన్నత పాఠశాలకు ఆదనపు గదులు, సీసీ రోడ్లు వంటి పనులు బీఆర్‌ఎస్ హయాంలో జరిగాయని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డార్ఫ్ వర్ధంని అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ సోనేరావ్, మాజీ సర్పంచ్ కినక రాంషావ్, పర్చకీ హన్మంత్‌రావ్, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.