జహీరాబాద్ ఏవో లావణ్యకు జాతీయ అవార్డు
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:57 AM
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల వ్యవసాయాధికారి నీరడి లావణ్యకు జాతీయ స్థాయి అవార్డు వరించింది.
జహీరాబాద్ రూరల్, అక్టోబర్ 15 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల వ్యవసాయాధికారి నీరడి లావణ్యకు జాతీయ స్థాయి అవార్డు వరించింది. వ్యవసాయ రంగంలో విశేష సేవలందిస్తున్న మహిళా రైతులను, అంకితభావంతో పనిచేస్తున్న అధికారులను ప్రోత్సహించడానికి కేంద్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ మహిళా కిసాన్ దివాస్ను గురువారం న్యూఢిల్లీలో నిర్వహించారు. తెలంగాణ నుంచి జహీరాబాద్ ఏవో నీరడి లావణ్య జాతీయ స్థాయి ఉత్తమ అధికారిగా అవార్డును అందుకున్నారు.