kumaram bheem asifabad- అక్రమాల కట్టడికి ‘యుక్తధార’
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:48 PM
వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా చేపట్టే ఉపాధి పనుల్లో అక్రమాలకు తావు లేకుండా గ్రామం యూనిట్‌గా పనులు చేపట్టనున్నారు. సాంకేతికతను జోడించి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద జరుగు తోన్న పనులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తోంది.
- కూలీల వివరాలు, ఖర్చులు ఆన్‌లైన్‌లో నమోదు
- ప్రతీ పంచాయతీకి ఐడీ లాగిన్
వాంకిడి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా చేపట్టే ఉపాధి పనుల్లో అక్రమాలకు తావు లేకుండా గ్రామం యూనిట్‌గా పనులు చేపట్టనున్నారు. సాంకేతికతను జోడించి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద జరుగు తోన్న పనులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధి కింద చేపట్టే పనుల్లో ఎలాంటి అవకతవకలకు చోటులే కుంండా ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ప్రతి సామాజిక తనిఖీలోనూ ఉపాధి హామీ పనుల్లో అవినీతి అంశాలు వెలుగు చేస్తూనే ఉన్నాయి. ఇందుకు సమయం, నిధులు వృథా అవుతున్నాయి. వీటన్నింటికి చరమగీతం పాడాలని కేంద్రం సంకల్పిం చింది. ప్రతి గ్రామంలో యుక్తాధార సాఫ్ట్‌వేర్‌తో జరిగే ప్రక్రియ ఈ నెలఖరులోగా అమలుకానుంది. ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండ లాల పరిధిలో 335 గ్రామపంచాయ తీలు ఉన్నాయి. జిల్లాలో 84 వేల ఉపాధి జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.52లక్షల మంది కూలీలున్నారు. 1.15లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. ఏటా నిర్దేశించిన పనులు చేపడుతున్నారు. మరోవైపు ఉపాధి పనుల పౖ సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతున్నా అధికారుల చర్యలు అంతంతే. జరిమా నాలు విధించినా మార్పు రావడం లేదు. రికవరీ సైతం నామమాత్రంగానే ఉంటోంది. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
- ఎల్‌నినో కారణంగా..
ఎల్‌నినో కారణంగా ఎచ్చే ఎనిమిది నెలలు కూలీ లతో పాటు చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు విరివిగా పనులు కల్పించేందకు గ్రామీణాభివృద్ది శా ఖ నడుం బిగించింది. భూగర్భజలాలు పెంపొందిం చేలా జల సంరక్షణ పనులు చేపడుతున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేలా, నీరు భూగర్భం లోకి ఇంకేలా జల సంరక్షణ పనుల్లో భాగం గా ఊట కుంటల నిర్మాణాలు చేపడుతు న్నారు. వీబీజీ రామ్‌జీలో గతంలో మండలా నికి ఒక పంచాయతీని యుక్తాఽధార పోర్టల్ కింద చేర్చి ఆ గ్రామం యూనిట్ కింద ఆ శివారులోనే పనులు కల్పించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ విధానం ప్రస్తుతం విజయ వంతం కావడంతో ఇక ప్రతి పంచాయతీకి అనుసం ధానం చేయనున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టే పనులను యాప్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేస్తా రు. ఆ ప్రదేశంలో గతంలో పనులు చేశారా ? ప్రస్తు తం చేపట్టవచ్చా? అనేది ఇంటర్‌నెట్ ద్వారా తెలు సుకుంటారు. బీపీఆర్‌ఎస్ ద్వారా పనుల ఎంపిక, నిర్వహణ సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీకి ఓ ఐడీ లాగిన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కూలీలకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేస్తున్నారు.