Share News

YouTuber Arrested: చిన్నారులతో అశ్లీల కంటెంట్‌.. యూట్యూబర్‌ అరెస్టు

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:26 AM

మైనర్లతో అశ్లీల కంటెంట్‌ రూపొందించి యూట్యూబ్‌లో ప్రసారం చేస్తోన్న ఓ యూట్యూబర్‌ను హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ‘

YouTuber Arrested: చిన్నారులతో అశ్లీల కంటెంట్‌.. యూట్యూబర్‌ అరెస్టు

  • ‘వైరల్‌ హబ్‌’ చానల్‌ నిర్వాహకుడు సత్యమూర్తిని కటకటాల్లోకి నెట్టిన హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

  • పోక్సో, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మైనర్లతో అశ్లీల కంటెంట్‌ రూపొందించి యూట్యూబ్‌లో ప్రసారం చేస్తోన్న ఓ యూట్యూబర్‌ను హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ‘వైరల్‌ హబ్‌’ అనే యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడు, ఏపీలోని వైజాగ్‌కు చెందిన కంబెటి సత్యమూర్తి(39)ని కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. సత్యమూర్తి ‘వైరల్‌ హబ్‌’ పేరుతో 2018 నుంచి యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులను ఇంటర్వ్యూ చేసిన సత్యమూర్తి వారికి అసభ్యకర ప్రశ్నలు వేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా ఆ చిన్నారులు ముద్దులు పెట్టుకునేలా చేసి ఆ వీడియోలను యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అతి జుగుప్సాకరంగా ఉన్న ఈ వీడియోలపై ఫిర్యాదులు అందగా.. పోక్సో, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్యమూర్తిని బుధవారం అరెస్టు చేశారు. అయితే, వైరల్‌ హబ్‌ యూట్యూబ్‌ చానల్‌ మాత్రం ఇంకా అందుబాటులోనే ఉండడం గమనార్హం.

Updated Date - Jan 08 , 2026 | 04:26 AM