kumaram bheem asifabad- యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:41 PM
యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్క రించుకొని సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా యువజన క్రీడ సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఆసిఫాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్క రించుకొని సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా యువజన క్రీడ సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువశక్తికి స్ఫూర్తిదాయకుడు వివేకానంద అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక విశిష్ఠతను ప్రపంచానికి చాటి చెప్పిన గురువు వివేకానంద అని కొనియాడారు. తన ఉపన్యాసలతో జగతిని జాగృతం చేసిన మహామేధావి అని తెలిపారు. యువత తమ శక్తిని సమాజ హితానికి వినియోగించి దేశభక్తి సేవభావాన్ని విస్తరించాలని దేశ అబివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా యువజన క్రీడ సేవల శాఖ అదికారి ఆశ్వక్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ నాయకులు విశాల్, గణస్త్రష్, పెంటయ్య, వెంకన్న, దీపక్, వినోద్, సంతోష్‌కుమార్, శ్రీనివాస్, ఇస్తారి, వెంకటేశ్వర్, విలాస్, శ్రీనివాస్, బి.శ్రీనివాస్, శ్రీధర్, రమేష, ప్రవీణ్, ఆశీష్, ప్రశాంత్, నితిన్, వేణుగోపాల్ పాల్గొన్నారు. పట్టణంలో బ్రాహ్మణ సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా వివేకానందుడి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ప్రతాప్, శ్రీనివాసరావు, రామకృష్ణ, అభయకుమార్, శివచరణ్, ఉదయ్‌కుమార్, ఉదయ్‌బాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్రీధర్, శ్రీనివాస్, వేణుగోపాల్, విలాస్, ఆశిష్, ప్రశాంత్, వెంకన్న, ప్రవీణ్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని క్రీడామైదానంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోట్నక విజయ్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. ఆయన బోధనలు ఎప్పుడు యువతకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఆయన ప్రసంగాలు యువకుల్లో చైతన్యం నింపుతాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్, బిజెపి, బీజేవైఎం మండల నాయకులు దుర్గం ప్రశాంత్, నరేష్, రామగిరి విశాల్, వికాస్, నరేందర్, అక్షయ్‌కుమార్, శ్రీకాంత్, తిరుపతి, చింటూ, గణేశ్ పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండల కేంద్రంలో సోమవారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.