యవత మత్తుకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - May 02 , 2026 | 09:37 PM
యువత బంగారు భవిష్యత్ సురక్షితంగా ఉండాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ అన్నారు. నస్పూర్ పట్టణం సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో శనివారం గంజాయి వినియోగం, దుష్పరిణా మాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ
నస్పూర్, మే 2 (ఆంధ్రజ్యోతి) : యువత బంగారు భవిష్యత్ సురక్షితంగా ఉండాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ అన్నారు. నస్పూర్ పట్టణం సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో శనివారం గంజాయి వినియోగం, దుష్పరిణా మాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులనుదేశించి సీపీ మా ట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూ పుతుందన్నారు. వినియోగం కారణంగా వ్యక్తిగత జీవి తం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం కూడా తీవ్ర ప్రభావితం అవుతాయన్నారు. భవిష్యత్‌ను దృష్టి లో పెట్టుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండా ల న్నారు. మాదక ద్రవ్యాలకు సంబందించిన ఏలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీస్‌స్టేషన్, తమ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కమిషనరేట్ పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నమన్నారు. గంజాయి అక్రమ ర వాణ, నిల్వ, సరఫరా పై నిఘా ఏర్పాటు చేసి నిందితు లను పట్టుకుంటున్నామన్నారు. అధికంగా జనం గుమి గూడే ప్రాంతాల ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టామన్నారు. మత్తుకు బానిసలైన వ్యక్తులను గుర్తిం చి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నామన్నారు. మా దకద్రవ్యాల వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజల సహకా రం అవసరమని, అందరూ అప్రమత్తంగా ఉండి బా ధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ఈ అవగాహన సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంక టేశ్వర్లు, జిల్లా వెల్పేర్ అధికారి రవూఫ్ ఖాన్, రూరల్ సీఐ రవీందర్, నార్కోటిక్స్ ఇన్స్‌పెక్టర్ రాజ్ కుమార్, నస్పూర్, హజీపూర్ ఎస్సైలు ప్రశాంత్, కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.