Share News

క్రీడల్లో యువత రాణించాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:32 PM

నల్లమల ప్రాం తం నుంచి యువకులు జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

క్రీడల్లో యువత రాణించాలి
కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలో గోల్డ్‌మెడల్‌ సాధించిన యువకుడిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేట/ టౌన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : నల్లమల ప్రాం తం నుంచి యువకులు జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. కరాటే ఇండియా అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో ఉత్తరాఖండ్‌లో నిర్వహిం చిన 4వ కె10 నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలో మండ ల పరిధిలోని అక్కారం గ్రామా నికి చెందిన యువకుడు ఇస్లావ త్‌ చైతన్య గోల్డ్‌మెడల్‌ సాధించా డు. యువకున్ని ఆదివారం ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ యువకు ల్లో చదువుతో పాటు క్రీడల్లో రాణించి నల్లమల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురా వాలన్నారు. నల్లమల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి క్రీడల్లో యువకులు పాల్గొని రాణిస్తున్నారని అన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:32 PM