kumaram bheem asifabad- యువత క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:19 PM
యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మహేష్‌గౌడ్ తండ్రి స్వర్గీయ వెంకటిగౌడ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను గురువారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు.
రెబ్బెన, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మహేష్‌గౌడ్ తండ్రి స్వర్గీయ వెంకటిగౌడ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను గురువారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమ శిక్షణను, క్రీడా స్పూర్తిని పెంపొంది స్తాయని అన్నారు. గెలుపోటమలును సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయని తెలిపారు. యువత క్రీడలపై దృష్టి సారించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల యువత ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా వారిలో ప్రతిభ వెలికి తీసే అవకాశం ఉంటుందని చెప్పారు. క్రీడలతో ఇతర ప్రాంతాల వారితో స్నేహసంబంధాలు పెరుగాయని అన్నారు. పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొ నాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ భరద్వాజ్, ఉప సర్పంచ్ వరల్‌క్ష్మి, దుర్గారావు, నాయకులు సంజీవ్, మధునయ్య, తిరుపతి, బి.తిరుపతి, పోచమల్లు, శ్రీధర్, శ్రీను, ప్రభాకర్, ఆనంద్, వినోద్, జేశ్వాల్, శంకరమ్మ, పద్మ, ఉబెదుల్లా, సాయి, పద్మ తదితరులు పాల్గొన్నారు.