Share News

యువత క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:19 PM

యువత క్రీడల్లో రాణించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ అన్నారు.

యువత క్రీడల్లో రాణించాలి

క్రీడలను ప్రారంభిస్తున్న రఘునాథ్‌

బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌

లక్షెట్టిపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడల్లో రాణించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జాతీయ యువజన దినోత్సవంతో పాటు సంక్రాంతి పండగను పురస్కరించుకుని రఘునాథ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ క్రీడకు మన ప్రాంతంలో ఒకప్పుడు మంచి పేరు ఉండేదని రోజురోజుకూ ఈక్రీడలు కనుమరుగవుతు న్నాయన్నారు. కబడ్డీ క్రీడతో యువత దేహదారుడ్యం కూడా పెంపొందించు కుంటారన్నారు. తప్పకుండా మన గ్రామాల్లో కబడ్డీ క్రీడలకు మొదటి ప్రా ధాన్యత ఇవ్వాలని కోరారు. కబడ్డీ క్రీడల్లో రాణించిన యువకులకు రాష్ట్ర స్థా యి జాతీయ స్థాయిలో విడుదల చేసే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుంద న్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అనంతరం వివేకానందుని చిత్రప టానికి పూలమాలలు వేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్‌ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈక్రీడలు రెండు రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు వీరమల్ల హరిగోపాల్‌రావు, గాజుల ముఖేష్‌ గౌడ్‌, గుండ ప్రభాకర్‌, రమేష్‌ చంద్‌, మఽధు, వెంకటేష్‌, సతీష్‌, నరసింహ, నరేష్‌ చంద్‌, రమేష్‌, గంగన్న, రాజేందర్‌తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:19 PM