ప్రాణం తీసిన చిలిపి చేష్ట!
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:35 AM
స్నేహితుడు సరదాకు చేసిన పనికి ఓ యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ఎలికట్ట శివారులో...
మలద్వారంలో గాలి పైపు పెట్టిన స్నేహితుడు
మృతి చెందిన యువకుడు
రంగారెడ్డి జిల్లాలోని ఓ పరిశ్రమలో ఘటన
షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : స్నేహితుడు సరదాకు చేసిన పనికి ఓ యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ఎలికట్ట శివారులో గల విజయ నేహ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇన్‌స్పెక్టర్ సీతారాం మంగళవారం వెల్లడించారు. ఎలికట్ట శివారులోని విజయ నేహ పరిశ్రమలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పవన్(22), సాయి అనే ఇద్దరు స్నేహితులు ప్యాకింగ్ సెక్షన్‌లో పని చేసేవారు. ఆదివారం సాయంత్రం పవన్ పని చేస్తుండగా సాయి గాలిపైపును వెనకాల నుంచి అతడి మలద్వారంలో రెండు సెకన్ల పాటు ఉంచాడు. ఈ క్రమంలో గాలి పవన్ శరీరంలోకి వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పవన్ అన్న అమన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సీతారాం తెలిపారు.