Share News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్‌లకు యువకుడు బలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:46 AM

ఆన్‌లైన్‌బెట్టింగ్‌లు, గేమ్‌లకు ఓ యువకుడు బలయ్యాడు. తన స్థోమతకు మించి తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లో పెట్టాడు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్‌లకు యువకుడు బలి

  • అప్పుల పాలై.. ఉరేసుకుని బలవన్మరణం

సరూర్‌నగర్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌బెట్టింగ్‌లు, గేమ్‌లకు ఓ యువకుడు బలయ్యాడు. తన స్థోమతకు మించి తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లో పెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. డబ్బు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో తిరిగి చెల్లించే స్థోమతలేక మనస్థాపంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌పరిధిలోని నందనవనంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం డివిజన్‌లోని నందనవనంలో నివాసముండే కె.లక్ష్మీకాంత్‌(24) రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్‌గేమ్‌లు, బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. బెట్టింగ్‌ల కోసం పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ నెల 19న రాత్రి ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 04:46 AM