Share News

మీ సమయస్ఫూర్తి అభినందనీయం

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:33 AM

నీట్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీసులు అందించిన రవాణా సేవలను డీజీపీ సీవీ. ఆనంద్‌ అభినందించారు.

మీ సమయస్ఫూర్తి అభినందనీయం

నార్కట్‌పల్లి పోలీసులకు డీజీపీ అభినందన

నార్కట్‌పల్లి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): నీట్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీసులు అందించిన రవాణా సేవలను డీజీపీ సీవీ. ఆనంద్‌ అభినందించారు. ఆదివారం జరిగిన జరిగిన నీట్‌ పరీక్షకు సంబంధించి మీడియాలో వచ్చిన క్లిప్లింగ్‌లను కోట్‌ చేస్తూ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టుచేశారు. నార్కట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నీట్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే ఆదేశాలతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నార్కట్‌పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తితో పాటు నల్లగొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో గల ఆయా పీఎ్‌సల నుంచి ఎస్‌ఐలతో పాటు వివిధ హోదాల్లో గల సిబ్బంది ఇక్కడ బందోబస్తు నిర్వహించారు. నీట్‌ పరీక్ష రాసేందుకు ఎంజీ యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులకు రవాణా సేవలందించారు. యూనివర్సిటీ ప్రవేశ ద్వారం నుంచి తమ పోలీస్‌ వాహనాలతో పాటు ద్విచక్రవాహనాలపై నీట్‌ రాసే విద్యార్థులను లోపలికి దాదాపు అరకిలోమీటరు దూరానికి పైగా ఉన్న పరీక్షా కేంద్రాలకు తరలించేలా చొరవ చూపారు. ఈ దృశ్యాలన్నీ ఓ టీవీ ఛానల్‌లో ప్రసారయ్యాయి. వీటిని నల్లగొండ చెందిన జయప్రకాష్‌రెడ్డి అనే ఓ డాక్టర్‌ నల్లగొండ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిని జిల్లా ఎస్పీకి ట్యాగ్‌ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్‌ కూడా స్పందించారు. వీరందరికీ రివార్డు ఇవ్వాలని ఎస్పీకి ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated Date - Jun 23 , 2026 | 12:33 AM