kumaram bheem asifabad- యువ విలాపం
ABN , Publish Date - Apr 04 , 2026 | 10:52 PM
యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన రాజీవ్ యువ వికాసం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దరఖాస్తు లు సమర్పించి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందు దామనుకున్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి.
- ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు
- ఇంటర్వ్యూలు పూర్తయినా సర్కార్ నుంచి స్పష్టత కరువు
- జిల్లాలో 29 వేల మంది దరఖాస్తు
ఆసిఫాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన రాజీవ్ యువ వికాసం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దరఖాస్తు లు సమర్పించి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందు దామనుకున్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. రాయితీ రుణాల పంపిణీపై సందిగ్దత నెలకొంది. దీంతో దరఖాస్తుదారులు ప్రభు త్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు.
ఫ ప్రభుత్వ సూచన మేరకు..
ప్రభుత్వ సూచన మేరకు యువ వికాసం పథకానికి జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖా స్తులు చేసుకున్నారు. ఈ పథకం కిద ఎస్సీ, ఎస్టీ. బీసీ, ఈడబ్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుం చి మొదలుకొని రూ.4లక్షల వరకు వివిధ రకాల యూనిట్ల కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ.50 వేల యూనిట్‌కు 100 శాతం సబ్సిడీ,రూ. లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం70 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్ కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌తో పాటు అప్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించారు. దీంతో ఈ పథకా నికి జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 29,756 మంది దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధి దారుల ఎంపిక కోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేసి అధికారులు, బ్యాంకు సిబ్బందితో కలిసి ఇంటర్వూలు సైతం నిర్వహిం చారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిం చాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సర్కార్ ప్రకటన చేసింది. కానీ నేటికి పథకం అమలుకు నోచుకోలేదు. సుమారు ఏడాది కావస్తున్నా ప్రభు త్వం నుంచి యువ వికాసం అమలుపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో దరఖాస్తుధారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఫ 15 మండలాల పరిధిలో..
జిల్లాలోని 15 మండలాల పరిధిలోని 335 గ్రామ పంచాయతీల పరిధిలో రాజీవ్ యువ వికాసం పథకానికి వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత 29.756 మంది ధరఖాస్తు చేసుకున్నారు. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. ఆసి ఫాబాద్ మండలంలో 3,040 మంది. కాగజ్‌నగర్‌లో 5,486, రెబ్బె నలో 2,827, కౌటాలలో 2,327 మంది దరఖాస్తు చేసుకున్నారు. చింతలమానేపల్లిలో 1,90 7, జైనూర్‌లో 1,860, బెజ్జూరులో 1,788, కెరమెరి లో 1,761, తిర్యాణిలో 1,690, దహెగాంలో 1.622, సిర్పూర్(టి)లో 1,616, వాంకిడిలో 1,074, పెంచికల పేటలో 1,072, సిర్పూర్ (యు)లో 893, లింగా పూర్‌లో 793 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ రుణాలు అందకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
కిరాణ దుకాణం ఏర్పాటుకు..
- సురేష్, ఆసిఫాబాద్
రాజీవ్ యువ వికాసం పథకంలో కిరాణ దుకా ణం ఏర్పాటు కోసం రూ. 4 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యాను. ఇంటర్వ్యూలో అధికారులు అన్ని ధ్రువీకరణ పత్రాలు పరిశీ లించారు. జూన్ రెండు నుంచే రుణాలు ఇస్తామని చెప్పారు. నేటికి రుణం మంజూరు కాలేదు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వెంటనే రుణం మంజూరు చేయాలి.
కాలయాపన చేయడం సరికాదు..
- సుచిత్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం రు ణాలు మంజూరీలో కాలయాపన చేయడం సరి కాదు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేం దుకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రు ణాలు ఇస్తామని చెప్పి దీనిపై నిర్ణయం తీసుకో కుండా దరఖాస్తుదారులను ప్రభుత్వం మోసం చే యడం సరికాదు. రుణాలను వెంటనే మంజూరు చేయాలి.