Share News

యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీలో బీటెక్‌, బీఎస్సీ

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:33 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చాన్సలర్‌గా వ్యవహరిస్తోన్న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ (వైఐఎ్‌సయూ) కొత్త విద్యావిధానానికి శ్రీకారం చుట్టింది.

యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీలో బీటెక్‌, బీఎస్సీ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చాన్సలర్‌గా వ్యవహరిస్తోన్న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ (వైఐఎ్‌సయూ) కొత్త విద్యావిధానానికి శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్‌ వేదికగా.. పరిశ్రమలు, హాస్పిటల్స్‌ భాగస్వామ్యంతో రెండు నూతన అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను ప్రకటించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కోర్సులను రూపొందించినట్లు వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ వి.ఎల్‌.వి.ఎ్‌స.ఎస్‌. సుబ్బారావు వెల్లడించారు. ఇందులో భాగంగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెటెరో, భారత్‌ బయోటెక్‌ వంటి దిగ్గజ ఫార్మా సంస్థల భాగస్వామ్యంతో ‘బీటెక్‌ ఇన్‌ అప్లైడ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కోర్సు’ను రూపొందించామని చెప్పారు. ఈ కోర్సులో మెదటి సంవత్సరం మాత్రమే తరగతి గదిలో విద్యాబోధన ఉంటుంది. మిగిలిన కాలమంతా విద్యార్థులు ఆయా కంపెనీలలో నేరుగా ప్రాక్టికల్‌ శిక్షణ పొందుతారు. చివరిసంవత్సరం ఇంటర్న్‌షి్‌పకు కేటాయించారు. మరోవైపు, ఏఐజీ ఆసుపత్రి భాగస్వామ్యంతో ‘బీఎస్సీ ఇన్‌ కార్డియోవాస్కులర్‌ సైన్సెస్‌’ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సు చదివే విద్యార్థులు ఆసుపత్రి వాతావరణంలోనే నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొందుతారని వైస్‌ చాన్సలర్‌ చెప్పారు. ట్యుటోరియల్స్‌ పాయింట్‌ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, సాప్ట్‌ స్కిల్స్‌, ఎథికల్‌ హ్యాకింగ్‌ వంటి విభిన్న రంగాల్లో సుమారు 75 రకాల డిజిటల్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. బీటెక్‌ కోర్సుకు ఏడాదికి దాదాపు రూ. 1.75 లక్షలు, బీఎస్సీ కోర్సుకు సుమారు రూ.1 లక్షగా ఫీజులు నిర్ణయించారు. ప్రవేశపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. త్వరలోనే ప్రవేశ పరీక్ష తేదీలను వెల్లడించనున్నారు.

Updated Date - Apr 10 , 2026 | 05:33 AM