‘యంగ్ ఇండియా’ విద్యార్థులకు..కార్పొరేట్ తరహాలో బస్సు సౌకర్యం
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:01 AM
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు.. కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలోనే బస్సు సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర రోడ్డు...
రాష్ట్రంలో 3.15కోట్ల మందికి ‘ఇందిరమ్మ జీవిత బీమా’: మంత్రి కోమటిరెడ్డి
తిప్పర్తి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు.. కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలోనే బస్సు సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని 3.15కోట్ల మందికి జీవిత భద్రత కల్పించేలా ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని ఈ నెల 1నుంచే అమల్లోకి తెచ్చామని వెల్లడించారు. వచ్చే మూడేళ్ల కాలంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తిప్పర్తి మండల అభివృద్ధి కోసం రూ.60లక్షలతో సీసీ రోడ్లు, రూ.6 కోట్లతో జూనియర్ కళాశాల, రూ. 26 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలోకిప్రవేశించే వారికి వ్యక్తిగతంగా ఒక్కో ఇంటికి రూ.20వేలు ఇస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఇప్పటికే మండలంలో 130మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశామన్నారు.