విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:08 AM
పొలం వద్ద మోటారు స్టార్టర్‌ను సరిచేస్తుండగా కరెంటు షాక్ వచ్చి ఓ రైతు చనిపోయాడు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రానికి చెందిన...
మాగనూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పొలం వద్ద మోటారు స్టార్టర్‌ను సరిచేస్తుండగా కరెంటు షాక్ వచ్చి ఓ రైతు చనిపోయాడు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రానికి చెందిన యువ రైతు బచ్చి దేవప్ప(32) శుక్రవారం సాయంత్రం పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం అక్కడికి వెళ్లి చూడగా దేవప్ప విగతజీవుడిగా కనిపించాడు. మోటార్ స్టార్టర్‌లో సమస్య రావడంతో దాన్ని సరిచేయబోయి విద్యుత్ షాక్‌కు గురై అతడు మరణించినట్లు గుర్తించారు. మృతుడికి భార్య, కుమారుడు, 6 నెలల కూతురు ఉన్నారు.