kumaram bheem asifabad- చిన్నారులకు సమతుల్య పోషకాహారం అందించాలి
ABN , Publish Date - Oct 01 , 2026 | 10:44 PM
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు సమతుల్యమైన పోషకాహారాన్ని అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో చేపట్టిన తొలిముద్ద అల్పాహారం పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్‌లతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి 6 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు సమతుల్య పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు సమతుల్యమైన పోషకాహారాన్ని అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో చేపట్టిన తొలిముద్ద అల్పాహారం పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్‌లతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి 6 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు సమతుల్య పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి తొలిముద్ద అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలకు ఉప్మా, కిచిడితో కూడిన ఆహారం అందించారు. అనంతరం జన్కాపూర్ రైతు వేదికలో పోషణ మాసంలో బాగంగా ఏర్పాటు చేసిన గర్భిణులకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యువో స్వరూపరాణి, కౌన్సిలర్ కొండు భారతి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానం చేయాలి..
అనారోగ్యంతో, అపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని కలెక్టర్ హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ప్రమాదాలకు గురై అత్యవసర సమయాల్లో రక్తం అవసరం ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా నిలువవచ్చని రక్తదానం చేయడంతో శరీరంలో నూతన రక్తం పెంపొందుతుందని తెలిపారు. ఈ సందర్బంగా ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వెంకన్న, ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్, డీఎంహెచ్‌ఓ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.