ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:43 PM
పదవ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హా జరై విజయ లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈవో యాద య్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తెలం గాణ మోడల్ స్కూల్‌లో కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో మండలంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహనసదస్సు నిర్వహించారు.
- డీఈవో యాదయ్య
కాసిపేట, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హా జరై విజయ లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈవో యాద య్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తెలం గాణ మోడల్ స్కూల్‌లో కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో మండలంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహనసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయ పాలన పాటించి ప్రణాళిక బ ద్దంగా చదువుకుంటే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ప రీక్షలకు హాజరైతే మంచి మార్కులు సాధించవచ్చ న్నారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బానావత్ ప్రకాష్ నాయక్ విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు రాసే విధానంపై వివరిం చా రు. ఈసందర్భంగా అతిథులను ప్రెస్‌క్లబ్ సభ్యు లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ వో ముక్తవరం వెంకటేశ్వర స్వామి, జిల్లా కో ఆర్డినే టర్ సత్యనారాయణమూర్తి, దేవాపూర్ అదాని సిమెం ట్ క్రెడిట్ సొసైటి చైర్మన్ అక్కెపల్లి శ్రీనివాస్, కాసి పేట కాంప్లెక్స్ హెచ్‌ఎం సాంబమూర్తి, డిప్యూటి ఫారె స్టు రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్‌నాయక్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కలీల్, గర్ల్ చైల్డ్ స్పెషల్ ఆఫీసర్ విజయ లక్ష్మీ, గైడ్ టీచర్లు బండ శాంకరి, నాగమల్లయ్య, అరు ణ, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కంటం తిరుపతి, గౌర వాధ్య క్షులు చెట్టిశ్రీధర్, ప్రధాన కార్యదర్శి కూకట్ల రాజేష్, పాల్గొన్నారు.