Share News

ఈ-నామ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:50 AM

ఈ-నామ్‌ పోర్టల్‌లో రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి అన్నారు.

ఈ-నామ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి
ఈ-నామ్‌ పోర్టల్‌ నమోదు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కొప్పుల వేణారెడ్డి

భానుపురి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఈ-నామ్‌ పోర్టల్‌లో రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో ఈ-నామ్‌ పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ గదిని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం సూర్యాపేటలో అమలు అవుతున్న 1.0 పాత విధానం స్థానంలో కేంద్ర ప్రభు త్వం కొత్త విధానం 2.0 ఈ-నామ్‌ అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. గేట్‌ ఎంట్రీలో రైతు పేరు, గ్రామం పేరు, సరుకు వివరాలు, బస్తాల సంఖ్య, వాహనం వివరాలు, కమీషన్‌దారు పేరు నమోదు చేయాల్సి ఉందన్నారు. వీటితో పాటు పుట్టిన తేదీ, ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌లు అందజేసి నమోదు చేసుకోవాలన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించడానికే ఈనామ్‌ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కార్యదర్శి ఫసియోద్దీన్‌, సహాయ కార్యదర్శి వెంకటరెడ్డి, యూడీసీ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:50 AM