kumaram bheem asifabad- సర్‌లో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:48 PM
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం సర్ ప్రక్రియ సహాయ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణక్క కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అపోహలు లేకుండా చూసుకోవాలన్నారు
సిర్పూరు(టి), జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం సర్ ప్రక్రియ సహాయ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణక్క కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అపోహలు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రటీ ఒక్కరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. ప్రతీ కార్యకర్త ఓటరు ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతీఒక్కరి పేరు ఉండేలా కార్యకర్త చూసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తప్పులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎలాంటి సమస్యలున్నా కూడా తమ కార్యకర్తలు నివృత్తి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ షకీల్, సిర్పూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అఖిల్, మాజీ జడ్పీ చైర్మన్ సిడాం గణపతి, నాయకులు దుర్గం తులసిరాం, మాజీ ఎంపీటీసీ సోహెల్ అహ్మద్, నాయకులు రవీందర్, సలీం, అమిన్, హుస్సేన్, ముంతకిర్ హుస్సేన్ పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియపై అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. కౌటాల మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి సర్ ప్రక్రియ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటు చోరి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్‌ఐఆర్ పేరుతో ఓటు చోరికి పాల్పడే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రతీ ఒక్కరు పేరు ఓటరు జాబితాలో ఉండేట్టు చూడాల్సిన బాధ్యత కార్యకర్తపై ఉందన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ సహాయాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో ఎవరు పేరు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ విషయంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆరా తీయాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా కూడా సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.