kumaram bheem asifabad- కాడేద్దులు కనుమరుగు
ABN , Publish Date - Jun 28 , 2026 | 10:20 PM
వ్యవసాయంలో ఎద్దుల తో రైతులకు విడదీయ రాని బంధం ఉంది. ఒకప్పుడు రైతుల జీవితంలో కాడెద్దులు ప్రముఖ పాత్ర పోషించేవి. భూమిలో దుక్కి దున్ని, విత్తు విత్తడం దగ్గరి నుంచి పండిన పంటను ఎడ్లబండిలో ఇంటికి చేర్చే వరకు పనులు జరిగిపోయేవి. గతంలో రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న ఏ రైతు ఇం ట్లో చూసినా ఎద్దులు కనిపించేవి. కానీ మా రుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసా యంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. ఎద్దులతో ఒక రోజు చేసే పని యంత్రాలతో ఒకటి, రెండు గంటల్లోనే పూర్తవుతోంది. దీంతో నాగలి పట్టి భూమి చదును చేసే రైతుల సంఖ్య తగ్గిపోయింది.
- రైతుపై పెట్టుబడి భారం
జైనూర్/సిర్పూర్(యు)/లింగాపూర్, జూ న్ 28 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో ఎద్దుల తో రైతులకు విడదీయ రాని బంధం ఉంది. ఒకప్పుడు రైతుల జీవితంలో కాడెద్దులు ప్రముఖ పాత్ర పోషించేవి. భూమిలో దుక్కి దున్ని, విత్తు విత్తడం దగ్గరి నుంచి పండిన పంటను ఎడ్లబండిలో ఇంటికి చేర్చే వరకు పనులు జరిగిపోయేవి. గతంలో రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న ఏ రైతు ఇం ట్లో చూసినా ఎద్దులు కనిపించేవి. కానీ మా రుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసా యంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. ఎద్దులతో ఒక రోజు చేసే పని యంత్రాలతో ఒకటి, రెండు గంటల్లోనే పూర్తవుతోంది. దీంతో నాగలి పట్టి భూమి చదును చేసే రైతుల సంఖ్య తగ్గిపోయింది. ఈ మేరకు రానునారు కాడెద్దుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు పశువుల ధరలు పెరిగిపోవడం, పోషణ సైతం భారంగా మారడంతో క్రమేణ కాడెద్దుల సంఖ్య తగ్గిపో తోంది. ప్రస్తుతం కొందరి వద్దే కాడెద్దులు ఉండడంతో వారి వద్ద అవసరమైన రైతులు అద్దె చెల్లిస్తూ పనులు చేసుకుంటున్నారు. గ్రామాల్లో కొందరు తమకున్న కొద్ది పాటి భూమిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ మిగితా ఖాళీ రోజుల్లో చిన్న సన్నకారు రైతులకు తమ కాండేడ్లను అద్దెకు ఇస్తున్నా రు. వానాకాలంలో పంటల సాగు ఖర్చులు పెరగిపోయాయి. విత్తనాలు, ఎరువులే కాదు.. చివరకు కాడెద్దుల కిరాయి కూడా పెరిగి పోయింది. గతంలో అన్నదాతల ఇళ్లు కాడె ద్దుల గజ్జల శబ్దాలతో కళకళలాడేవి. వర్షాలు సరైన సమయాల్లో కురవక పంట సాగు తగ్గడం, పశువులకు మేత కరవై వాటి పోషణ కష్టతరంగా మారడం వంటి కారణా లతో అన్నదాతలకు పశుపోషణ భారమైంది. దీనికి తోడు ఎద్దుల ధరలు విపరీతంగా ఉన్న కారణంగా వాటిని కొనలేని దుస్థితిలో ఉన్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.
- తగ్గని ఆదరణ..
మార్కెట్లో అత్యాధునిక యాంత్రీకరణ ఎంత పెరిగినా ఎడ్లకు ఉన్న ఆదరణ మా త్రం తగ్గడం లేదు. దీంతో గ్రామాల్లో కాడెద్దులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది వానాకాలం సాగుకు అన్నదాతలు శ్రీకారం చుట్టారు. ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో సాగుపై ఆశలు చిగురిస్తు న్నాయి. జిల్లాలో ఇప్పటికే భూములు దున్ని విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతు న్నారు. విత్తనాలు పెట్టేందుకు ఎద్దులు, నాగళ్ల అవసరం ఉంటుది. చాల మంది రైతన్నల వద్ద కాడెద్దులు లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. విత్తనాల విత్తు వేసేందుకు అచ్చు (గీతలు) వేసేందుకు కాడెద్దులు దొరకడం లేదు. ఎడ్ల జత ఉన్న వారు వారి పనులు అయ్యాక రోజు రూ. 1500 నుంచి రూ.1800 వరకు అద్దె తీసు కుంటున్నారు. కాడెద్దులు లేని రైతులకు వేరే మార్గం లేక డబ్బులు ఇచ్చి పనులు చేస్తు న్నారు. పెరుగుతున్న విత్తన, ఎరువుల ధరల కు తోడు కాడెద్దులు అద్దెలు సైతం భారమ య్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు రూ. 1,500 చెల్లించాం..
మేస్రాం వినాయక్, దేవుడ్‌పెల్లి
పంట వేసేందుకు కాడెద్దుల జతకు రోజుకు రూ. 1,500 అద్దెక చెల్లించాం. నాకున్న ఐదేకరాల్లో మూడెకరాల పత్తి, రెండు ఎక రాలు జొన్న, కంది తదితర పంటలు సాగు చేశా. ఎడ్ల జతలు లేక పోవడంతో వేసవి లోనే ట్రాక్టర్‌తో పొలాన్ని చదను చేసి విత్తనా లే వేయడానికి సిద్ధం చేసుకున్నా. రెండు రోజుల క్రితం రూ. 1500 అద్దెకు కాడెద్దులు దొరకడంతో విత్తనాలు వేశాం. ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా ఎడ్ల జతలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.