Share News

సనాతన జ్ఞాన సంప్రదాయమే.. యోగా

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:42 AM

వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశ సనాతన జ్ఞాన ...

సనాతన జ్ఞాన సంప్రదాయమే.. యోగా

  • ఇది జీవన విధానం: గవర్నర్‌ శివప్రతాప్‌

  • మోదీ కృషి ఫలితమే యోగా డే: కిషన్‌రెడ్డి

  • దివ్య ఔషధం: రాంచందర్‌ రావు

  • భారత సంస్కృతిలో భాగం..యోగా: లక్ష్మణ్‌

  • పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా డే కౌంట్‌డౌన్‌’

అడ్డగుట్ట, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశ సనాతన జ్ఞాన సంప్రదాయమే యోగా అని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. యోగా అంటే వ్యాయామం కాదని, ఒక జీవన విధానమని పేర్కొన్నారు. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే మహోన్నత సాధనమని అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో కౌంట్‌డౌన్‌ యోగా డే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేల మంది విద్యార్థులతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యఅతిఽథిగా గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా మాట్లాడుతూ ప్రధాని మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిందన్నారు. గత 12 ఏళ్లుగా వికాస్‌ బీ - వి సాత్‌ బీ అనే మంత్రంతో సాంస్కృతిక పునరుజ్జీవంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ యోగాను ప్రంపంచానికి పరిచయం చేసి, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధాని మోదీ అని గుర్తుచేశారు. మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి అధికారంగా జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది ప్రధాని మోదీనే అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. యువత రోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. మానసిక ఒత్తిడికి యోగా ఒక దివ్య ఔషధ వంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అభిప్రాయపడ్డారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో యోగా ఒక భాగమని, యోగా డేను జరుపుకోవడం ప్రతి భారతీయుడికి సంతోషాన్నిస్తుందని ఎంపీ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. శారీరక, మానసిక దృఢత్వానికి యోగా ఎంతో అవసరమని అన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 04:42 AM