kumaram bheem asifabad-దిగుబడి సగమాయె.. మద్దతు ధరా రాకపాయె..
ABN , Publish Date - Jan 03 , 2026 | 10:53 PM
జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతులకు విపత్తునే మిగిల్చింది. ఎడతెర పి లేకుండా కురిసిన వర్షాలు పత్తి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. అతివృష్టితో పంటకు నష్టం వాటిల్లడం తో దిగుబడులు సగానికి పడిపోయాయి. మరోవైపు మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నా పంటకు నష్టం వాటిల్లడంతో పెట్టుబడులన్న తిరిగి వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- అనుకూలించని వాతావరణం
- పత్తి రైతును దెబ్బ తీసిన అధిక వర్షాలు
- అతివృష్టితో పంటకు నష్టం
బెజ్జూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతులకు విపత్తునే మిగిల్చింది. ఎడతెర పి లేకుండా కురిసిన వర్షాలు పత్తి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. అతివృష్టితో పంటకు నష్టం వాటిల్లడం తో దిగుబడులు సగానికి పడిపోయాయి. మరోవైపు మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నా పంటకు నష్టం వాటిల్లడంతో పెట్టుబడులన్న తిరిగి వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి సాగు గతేడాది రైతులకు సిరులు కురిపించింది. దీంతో ఈసారి సైతం పత్తి సాగు బాగుంటుందన్న ఆశతో రైతులు పత్తి పంట వేశారు. కుమరం భీం ఆసి ఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది అధికంగా పత్తి సుమారు 3.60లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వానాకాలం ప్రారంభంలో అడపా దడపా వర్షాలు కురియడంతో రైతులంతా పత్తి విత్త,నాలు నాటి సాగుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత సరైన వర్షాలు కురవలేదు. సెప్టెంబరు, అక్టోబరులో తీవ్రంగా, నవంబరు మొదటి వారం వరకు ఆలస్యంగా కురిసిన భారీ వర్షాలు, తుఫాను ప్రభావం అతివృష్టికి దారి తీసింది. దీంతో పంట ఎదుగుదలపై ప్రభావం పడింది. పత్తి పంటకు నల్ల తెగులు, వేరుకుళ్లు, ఆకుపచ్చ, తెగుళ్లు సోకడంతో మరింత నష్టం వాటిల్లింది. దీంతో పత్తి ఏపుగా పెరగలేదు. కొన్ని చోట్ల పెరిగినా కాయ సరిగా కాయలేదు. భారీ వర్షాలు రోజుల తరబడి పత్తి చేలల్లో నీట మునిగి ఉండటంతో పత్తికి వివిద రకాల తెగుళ్లు ఆశించి ఎదుగుదల నిలిచి పోయింది. దీంతో రైతులు ఆశించిన మేర పంట చేతికి రాలేదు.
- ఎకరాకు ఐదు క్వింటాళ్లే..
జిల్లాలో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు పత్తి ఎదుగుదల పూర్తిగా నిలిచి పోవడంతో రైతులు ఆశించిన మేర దిగుబడులు మాత్రం లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు కేవలం ఐదు, ఆరు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోందని రైతులు తెలుపుతున్నారు. ఎకరాకు పది నుంచి పన్నెండు క్వింటాళ్లు రావాల్సి ఉండగా పత్తికి ఆశించిన తెగుళ్ల కారణంగా అమాంతం దిగుబడి తగ్గిపోర ుుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు సాగు కోసం పెట్టుబడులు విపరీతంగా పెరిగాయని, పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందేలా కనిపిం చడం లేదని రైతులు వాపోతున్నారు. పంటల సాగు కోసం వ్యాపారుల వద్ద వడ్డీకి అప్పులు తెచ్చి మరీ సాగు చేశామని, కనీసం అప్పులు కూడా వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వాణిజ్య పంటైన పత్తిదే సింహబాగం. జిల్లాలో ఏటేటా పత్తి సాగు క్రమంగా పెరుగుతూ వస్తోంది.
- పెరుగుతున్న ధర..
పత్తి సాగు చేసిన రైతులకు ఓ పక్క పంట చేతికి వచ్చినా ఆశించిన మేర దిగుబడులు లేక దిగులు చెందుతున్న వేళ మరో పక్క పత్తి ధర మాత్రం పెరగడం సంతోషించదగ్గ విషయమే అయినా రైతులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఏటా పత్తి దిగుబడులు అధికంగా వచ్చే సమయంలో సరైన ధర లేక ఆందోళన చెందగా, ప్రస్తుతం సరైన దిగుబడి లేని సమయంలో పత్తి ధర పెరగడం ఒకింత ఆనందంగా ఉన్నా దిగుబడే రైతులను నిరాశకు గురి చేస్తోంది. ప్రస్తుతం పత్తి క్వింటాళుకు రూ.7,600ప్రైవేటులో పలుకుతోంది. సీసీఐలో ప్రభుత్వ మద్దతు ధర రూ.8100ఉండగా, కొందరు రైతులు సీసీఐలో విక్రయిస్తుండగా, మరి కొందరు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గతం కంటే ధర కొంతమేర అధికంగా ఉండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నా ఆశించిన మేర దిగుబడులు లేక నిరాశలో ఉన్నారు. వచ్చిన డబ్బుతో కొంతమేరన్న అప్పులు ముట్టజెప్పుకోవచ్చన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర పంట దిగుబడి వచ్చినట్లయితే మంచి ధర ఉన్నందున పిరులు కురిపించేవి అని రైతులు అంటున్నారు. ప్రస్తుతం పత్తితీత పనులు కొనసాగుతండగా కూలీలు దొరక్క ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కిలో పత్తి ఏరడానికి ఒక్కో కూలీకి రూ.10చొప్పున ఇస్తామన్నా కూలీలు దొరకని పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కూలీలను ఇతర గ్రామాల నుంచి తీసుకవస్తున్నామని రైతులు తెలుపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకరావడానికి ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తున్నామని రైతులు తెలుపుతున్నారు. అసలే ఈ ఏడాది దిగుబడులు లేక సతమతమ వుతుండగా కూలీలకు ఎక్కువగా డబ్బులు ఇస్తుండడంతో మరింత నష్టాలకు గురయ్యే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
- ప్రాణహిత తీరాల్లో అధిక నష్టం..
జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రాణహిత, పెన్‌గంగ, పెద్దవాగు తీర ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ తీర ప్రాంతాలైన బెజ్జూరు, చింతలమానే పల్లి, కౌటాల, దహెగాం, పెంచికలపేట, సిర్పూర్(టి) తదితర మండలాల సరిహద్దుల్లోని పత్తి చేలల్లో భారీగా వరద నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాణహిత, పెన్‌గంగ నదుల బ్యాక్ వాట ర్ రోజుల తరబడి పత్తి చేలల్లో నిల్వ ఉండటంతో పత్తికి తీరని నష్టం కలిగించింది. దీంతో పత్తి మొక్కలు ఆశించిన మేర పెరగలేదు. దీని కారణంగా పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. పత్తి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది అప్పులే మిగిలేలా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- ఊసేలేని పరిహారం..
భారీ వర్షాల కారణంగా జిల్లాలో సాగు చేసిన పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాణహిత, పెన్‌గంగ, పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కాగజ్‌నగర్ డివిజన్‌లో సుమారు ఈ ఏడాది పత్తి పంట 7వేలకుపైగా ఎకరాల్లో నీట మునిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేసింది. అప్పల్లో అధికారులు నామమాత్రంగా సర్వేలు జరిపి చేతులు దులుపుకున్నారు. పంట నష్టం సంభవించి నాలుగు నెలలు కావస్తున్నా నేటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. గత కొద్దేళ్లుగా భారీ వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం అవుతున్నా ప్రతి ఏటా ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడా విడుదల కావడం లేదని రైతులు వాపోతు న్నారు. భారీ వరదల నేపథ్యంలో రైతులంతా ఈసా రైనా నష్టపోయిన పంటకు పరిహారం వస్తుందేమో నని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది.
భారంగా పత్తి సాగు..
- కొట్రంగి శంకర్, రైతు ఎల్కపల్లి
ఈ ఏడాది పత్తి సాగు భారంగా మారింది. ఏకదాటిగా కురిసిన వర్షాలతో పత్తి ఏపుగా పెరగ లేదు. పత్తికి తెగుళ్లు వ్యాపించి దిగుబడి అమాంతం తగ్గడంతో ఏమా త్రం దిగుబడి రావడం లేదు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయో రావోనన్న అనుమానాలు ఉన్నాయి. ఏటా ప్రకృతి వైప రిత్యాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.