అమెరికాలో తెలంగాణ పరువు తీస్తున్న హరీశ్
ABN , Publish Date - May 23 , 2026 | 05:17 AM
హరీశ్‌రావు అమెరికా వెళ్లి అక్కడ తెలంగాణ పరువు తీస్తున్నారని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీలో పెట్టబడులు పెట్టాలని ఆ దేశంలోని ఎన్నారైలు...
ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్, మే 22(ఆంధ్రజ్యోతి): హరీశ్‌రావు అమెరికా వెళ్లి అక్కడ తెలంగాణ పరువు తీస్తున్నారని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీలో పెట్టబడులు పెట్టాలని ఆ దేశంలోని ఎన్నారైలు ఆలోచిస్తుంటే హరీశ్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని యువత భవిష్యత్తును, వారి కలలను డెబ్బతీయాలన్నదే హరీశ్‌రావు ఆలోచనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీపైన ఆయన ఎంత విష ప్రచారం చేసినా.. కంపెనీలకు సీఎం రేవంత్‌రెడ్డిపైనే విశ్వాసం ఉందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. ప్రతిపక్షాలు కూడా పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుంటాయన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టుబడులు రావద్దని చెప్పలేదన్నారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టేందుకే హరీశ్ వ్యాఖ్యలు చేశారన్నారు.