kumaram bheem asifabad- ఏళ్లుగా ఎదురుచూపులే..
ABN , Publish Date - Oct 27 , 2026 | 10:24 PM
మండలంలో రోడ్లు పూర్తికి ప్రజలకు ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయిలు మంజూరు చేస్తున్నా అటవీ అనుమతులు లేని కారణంగా పనులు నిలిచిపో తున్నాయి. గిరిజన గ్రామాల్లోని రహదారులు, వాగులు ఒర్రెలపై వంతెనలు లేక ప్రజలు బాధలు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపించిఏళ్లు గడుస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంది.
- రాకపోకలకు అవస్థలు పడుతున్న గిరిజనులు
- పట్టించుకోని అధికారులు, నాయకులు
తిర్యాణి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో రోడ్లు పూర్తికి ప్రజలకు ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయిలు మంజూరు చేస్తున్నా అటవీ అనుమతులు లేని కారణంగా పనులు నిలిచిపో తున్నాయి. గిరిజన గ్రామాల్లోని రహదారులు, వాగులు ఒర్రెలపై వంతెనలు లేక ప్రజలు బాధలు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపించిఏళ్లు గడుస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంది. 2010-11లో తిర్యాణి మంలం రొంపల్లి-గుండా రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో వంతెన నిర్మాణం చేపట్టి రెండు కిలోమీ టర్ల గుట్ట వరకు బీటీ వేశారు. గుండాల సమీపంలో అటవీ ప్రాంతం నుంచి అనుమతుల లేక పోవడంతో పనులు నిలిచిపోయాయి. పదహరేళ్లు గడుస్తున్నా కూడా ఈ పనులకు మోక్షం లేని పరిస్థితి నెలకొంది.
- భూ నిర్వాసితుల కోసం
కాగా సింగరేణి యాజమాన్యం భూ నిర్వాసితుల కోసం మణిక్యాపూర్-మంగీ రోడ్డు నిర్మాణానికి రూ.4.50 కోట్లను కేటాయించింది. మాణిక్యాంపూర్ నుంచి వయా భీంపూర్, హాస్నూర్ గుట్ట వరకు ఐదు కిలోమీటర్ల రదాహరి నిర్మాణం పూర్తి కాగా, మిగితా పనుల కు అనుమతులు లేక అటవీ అధికారులు పనులను నిలిపివేశారు. అలాగే మండలంలోని దాంపూర్-కేరిగూడ, కౌటగాం, పంగిడి మాదర, లింగాపూర్, గడలపల్లి-మరుగుమేడి, కైరిగూడ ఘాట్ సెక్షన్, ఉల్లిపిట్ట ఉపరితల గని, రాఘవపూర్-గోపర, మంగ్లీ-కౌటగాం, రొంపెల్లి-గుండాల, భీంపూర్-మంగీ, ఊట్ల-గుండాల తదితర గిరిజన గ్రామాల్లో రహదా రులు, వాగులపై వారదులు లేవు. కనీసం అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి, వర్షం కురిస్తే వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గొవెన పంచాయతీలో కొలాంగూడ, గోండుగూడ, నాయికపుగూడ గ్రామాలకు వెళ్లడానికి మూడు ప్రధా న మార్గాలున్నా కాలినడకనే బయటికి వెళ్లాల్సి వస్తోంది. కౌటగాం గ్రామ పంచాయతీ వాసులకు సైతం నడక కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.